పాటిగడ్డ ప్రాంతంలో పోలీసుల గస్తీ పెంచండి – నార్త్ జోన్ డీసీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫయాజ్……………

బేగంపేట ఓల్డ్ పాటిగడ్డ ప్రాంతంలో సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం నిర్మించిన నివాసాలు ఎక్కువ శాతం ఖాళీగా ఉండటంతో అవి అసాంఘిక శక్తులకు మందు ,గంజాయి బాబులకు అడ్డాలుగా మారాయని దీంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించి ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫయాజ్ గురువారం నార్త్ జోన్ డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓల్డ్ పాటిగడ్డలో సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం అప్పట్లో నివాస గృహాలు నిర్మించారని ఇప్పుడు అవి ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో అవి కొందరికి మద్యం గంజాయి సేవించేందుకు అడ్డాలుగా మారాయి అన్నారు ఎవరెవరో వచ్చి పోతుండటంతో స్థానికులు కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తరచూ గొడవలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు ఓల్డ్ పాటిగడ్డ, ఎన్బిటి నగర్ ,వికార్ నగర్ ,ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచాలని వారు ఫిర్యాదులో డిసిపిని కోరామన్నారు .ఓల్డ్ పాటి గడ్డ పక్కనే రైల్వే స్టేషన్, సుందరయ్య పార్కు, మోడల్ మార్కెట్లో కూడా బయటి ప్రాంతాలనుంచి వస్తున్న వ్యక్తులు మద్యం సేవిస్తున్నారని దీంతో సానికులు భయాందోళనకు గురవుతున్నారని వాటినీ అరికట్టాలని కోరారు. కొందరు యువకులు గంజాయి సిగరెట్లు తాగుతూ స్థానికులను ఇబ్బంది పెడుతున్నారని గంజాయి అమ్మకాలు సాగించే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డీసీపీకి తెలిపారు స్పందించిన డిసిపి తాను స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతోపాటు ఆ ప్రాంతంలో గస్తీ పెంచేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు మహమ్మద్ ఫయాజ్ తెలిపారు ఈ సందర్భంగా డిసిపికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు డిసిపిని కలిసిన వారిలో మాజీ మైనార్టీ చైర్మన్ మహమ్మద్ ముజ్మీర్ షరీఫ్ గ్రేటర్ హైదరాబాద్ మైనార్టీ కన్వీనర్ శభాష్ మహమ్మద్ అస్లం సనత్ నగర్ నియోజకవర్గం రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) ఉపాధ్యక్షులు వాజీడ్ తదితరులు ఉన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *