అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పోర్ట్స్ సెగ్మెంట్లో రూపొందించిన పల్సర్ ఎన్ ఎస్ 400 z ద్విచక్ర వాహనం శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు .సికింద్రాబాద్ ఎస్పి రోడ్ లోని యాత్రీ నివాస్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ యు బి క్లబ్ ప్రెసిడెంట్ హర్జీట్ ,వైస్ ప్రెసిడెంట్ జాన్లు ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా వంద మంది యువతకు ఒకేసారి ద్విచక్ర వాహనాలను డెలివరీ అందించారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో తెలంగాణ రీజినల్ మేనేజర్ కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఫ్రాక్షన్ కంట్రోల్ తో వచ్చిన ఈ ద్విచక్ర వాహనం రైడింగ్ లో నాలుగు మోడ్ లలో తయారయిందని చెప్పారు .ఈ మోడ్ లు వాహనం నడిపే వ్యక్తులకు ఎంతో రక్షణ ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని తెలిపారు డిజిటల్ మీటర్ డిఫరెంట్ లుక్స్ తో పాటు వైర్లెస్ యాక్సిలేటర్ తో యువతను ఎంతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు బజాజ్ ఆటో 75 సంవత్సరాలుగా రాజీపడని నాణ్యతతో 90 కి పైగా దేశాలకు అత్యుత్తమ తరగతి డిజైన్ వాహనాలను ఎగుమతి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బజాజ్ ఆటో లిమిటెడ్ సేల్స్ రీజినల్ మేనేజర్ కళ్యాణ్ రెడ్డి సర్వీస్ రీజినల్ మేనేజర్ స్టాలిన్ ఎస్ఎం సేల్స్ సూర్య అండ్ మౌర్య ముఖ్య అతిథి హెచ్ యు బి ప్రెసిడెంట్ హార్జీట్, వైస్ ప్రెసిడెంట్ జాన్ సన్నీ జాక బ్ దీపిక తదితరులు పాల్గొన్నారు.







