ప్రపంచ వ్యవసాయ దినోత్సవం నిర్వహణ

ప్రపంచ వ్యవసాయ దినోత్సవం పురష్కరించుకుని మండల వ్యవసాయాధికారి బి ప్రసాదరావు తాళ్లూరులో సోమవారం క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా నారుమళ్లు సాగు చేసిన రైతులతో మాట్లాడి పలు సలహాలు సూచనలు చేసారు. నారు మళ్లులో జింక్, ఇనుము, ధాతు లోపాలను గుర్తించి వెంటనే చర్యలు చేపడితే మంచిదన్నారు. జింక్ లోపం ఉంటే ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి విరిగి పోతాయన్నారు. తద్వార ఎదుగుదల లోపిస్తుందని అన్నారు. నివారణకు ఆఖరు దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వెయ్యాలన్నారు. ఇనుప ధాతు లోపం ఉంటే ఆకు పచ్చ రంగు పూర్తిగా పోయి ఆకులు రాలిపోవటం జరుగుతుందని అన్నారు. దీని నివారణకు లీటరు నీటికి 20 గ్రాముల అన్నబేథి, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చెయ్యాలని చెప్పారు. విఏఏ నాగరాజు నాయక్, రైతుల పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *