మైనర్లకు వాహనాలు ఇచ్చారా అలా ఇచ్చిన వారు జైలుకెళ్లడం ఖాయం అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు మంగళవారం బేగంపేట టిటిఐ లో తిరుమలగిరి మహా బోధి విద్యాలయం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టి టి ఐ ఏ సి పి శంకర్ రాజు మాట్లాడుతూ తల్లిదండ్రులు చిన్నారులను పాఠశాలలకు తీసుకు వెళుతున్న సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి అన్నారు వారిని ఒక చేతితో పట్టుకోవాలని రోడ్డు దాటే సమయంలో ఇరువైపులా వాహనాల రాకపోకలను గమనించిన తర్వాత మాత్రమే రోడ్డు దాటాలన్నారు అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఎవరైనా అలా ఇచ్చినట్లయితే వారు జైలుకు వెళ్ళడం ఖాయమని ఆయన వారికి హెచ్చరించారు ముఖ్యంగా యువత మితిమీరిన వేగంతో వాహనాలపై ప్రయాణిస్తూ వారి విలువైన ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఎదురుగా వస్తున్న వారి ప్రాణాలను కూడా బలిగొంటున్న సంఘటనలు బాధాకరం అన్నారు మైనర్లు వాహనాలు నడిపితే యజమానికి రూ 25000లు మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు దీనితో పాటు ఒక ఏడాది పాటు వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారని తెలియజేశారు విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లేందుకు పాస్పోర్ట్ ,వీసాలు జారీ కావని చెప్పారు ఈ ఏడాది 500 మంది మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో బేగంపేట టిటిఐ లో కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు ఈ సందర్భంగా చిన్నారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పైన ఏసిపి అవగాహన కల్పించారు తల్లిదండ్రులను గురువులను పూజించాలని ఆయన విద్యార్థులకు చెప్పారు ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ నాగభవాన్ని వైస్ ప్రిన్సిపాల్ స్వప్న ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

