గురుకులాల్లో గెస్ట్ టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం – జూలై 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి జూలై 6న చీమకుర్తి గురుకుల పాఠశాలో డెమో తరగతులు

ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, పీఈటీ పోస్టులలో గెస్ట్ టీచర్లను ఇంగ్లీషు మీడియంలో బోధించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డి జయ తెలిపారు. ఆయా సబ్జెక్టులు బోధించుటకు అభ్యర్థులు పీజీలో 55శాతం మార్కులు, బీఈడీ సంబంధిత సబ్జెక్టు మెధడాలజీ, టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అన్నారు. డిగ్రీ, పీజీ ఇంగ్లీషు మీడియం చదివిన వారికి ప్రాధాన్యం ఇవ్వబడునని చెప్పారు. బాలికల పాఠశాలలు, కళాశాలల్లో బోధించుటకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హలని తెలిపారు. తగిన అర్హత. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 5వ తేది సాయంత్రం ఐదు గంటల లోపు విద్యార్హతలు, కుల దృవీకరణ పత్రం ఒక జత జెరాక్స్ కాఫీలను చీమకుర్తి గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఇవ్వాలని చెప్పారు. ఈనెల 6వ తేదిన ఉదయం పది గంటలకు డెమో తరగతులు చీమకుర్తి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో జరుగునని చెప్పారు. డెమోలకు హాజరు అవుతున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్లను తీసుకురావాలని కోరారు. ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *