సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి -సాగర్ నీటితో వస్తున్న కలుషిత నీటిని అరికట్టాలి-బాధ్యతగా అధికారులు సర్వసభ్య సమావేశాలకు హాజరు కావాలి- ఎమ్మెల్యేగా తన శక్తి మేరకు అభివృద్ధికి కృషి -ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డితాళ్లూరు సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

పారిశుధ్యలోపం వలన గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, తాళ్లూరు సాగర్ మంచి నీటిలో డీప్ బోరు నీరు కలుస్తూ కలుషితం అవటంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన, ఎంపీడీఓ కెవై కీర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అధికార మార్పిడి తర్వాత జరిగిన మొదటి సమావేశం కావటంతో ఉత్కంఠ భరిత వాతావరణంలో జరిగినది. మిత్రులే శత్రువులుగా వ్యవహరించటం సభ్యులను విస్తుపోయ్యేలా చేసాయి. ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సిపీ ప్రభుత్వ హయాంలో గృహాలు నిర్మించుకుని ఎన్నికల కోడ్ వలన బిల్లులు కోసం, సిమెంట్ కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. సమావేశాలకు అధికారులే రాక పోతే సమస్యలపై చర్చ ఎలా జరుగుతుందని అన్నారు. రానున్న సమావేశాల్లో అధికారులు వచ్చేలా చూడాలని ప్రస్తుతం దాని అధికారులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని కోరారు.
ఏంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు ప్రజలకు అందించాలని కోరారు. గత ప్రభుత్వ పాలనలో గృహాలు మంజూరు అయ్యాయని లెక్కలు చెప్పిన అధికారులు ఒక్క లబ్ధిదారునికి ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజలు ఉపయోగ పడే విషయాలను మాత్రమే చెప్పాలన్నారు. ఈఓపీఆర్డీ గ్రామాలలో తిరిగి పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. మూడు నెలలకు ఒక సారి జరిగే సమావేశాలలో చేప్పటం తప్ప ఎమి జరగటం లేదని అన్నారు. వైద్యాధికారులు అందుబాటులో ఉండి సత్వర చికిత్సలు అందించాలని కోరారు. గ్రామాల్లో మంచి నీరు కలుషితం కాకుండా ఆర్డబ్ల్యు ఎస్ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. పది శాఖలకు చెందిన అధికారులు సమావేశానికి హాజరు కాక పోవటం గమనార్హం. వైఎస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బీ, హోమియో పతి వైద్యురాలు శిరీష, మండల విద్యాశాఖాధికారి గురుజాడ సుబ్బయ్య, ఎంపీటీసీలు, సర్పంచిలు, కోఆప్షన్ మెంబర్, విఆర్లు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *