డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించిన భూ యజమానులకు దుకాణాలను కేటాయిస్తూ మంజూరైన పత్రాలను లబ్దిదారులకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. రాంగోపాల్ పేట డివిజన్ అంబేద్కర్ నగర్ లో సరైన సౌకర్యాలు, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం ప్రస్తుత నాటి మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇండ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టడం కోసం అవసరమైన స్థలాన్ని పక్కనే ఉన్న స్థల యజమానులతో చర్చించి స్థలాన్ని సేకరించి ఇండ్లను నిర్మించారు. డబుల్ బెడ్
ఇండ్ల నిర్మాణం కోసం స్థలాన్ని అంబేద్కర్ నగర్ కు చెందిన దానబోయిన లక్ష్మి బాయి యాదవ్, శాంత బాయి, చింతల కృష్ణ యాదవ్, బాలేష్ యాదవ్ లు ఇచ్చారు. దీనికి పరిహారంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో నిర్మించిన దుకాణాలలో వీరికి 8 దుకాణాలను కేటాయిస్తూ జీ హెచ్ ఏం సీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేటాయింపు కు సంబంధించిన పత్రాన్నిఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసం వద్ద లబ్దిదారుడు బాలేష్ యాదవ్ కు అందజేశారు. శ్రీనివాస్ యాదవ్ కృషి వలనే తమకు దుకాణాల కేటాయింపు జరిగిందని బాలేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ బీ ఆర్ ఎన్ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
