పేద ప్రజలకు చేయూతను అందించడం అభినందనీయమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట కు చెందిన లక్ష్మి కు ప్రైమ్ రి హాబ్ సొల్యూషన్స్ కు చెందిన డైరెక్టర్ డాక్టర్ హారిక 22 వేల రూపాయల విలువైన వినికిడి పరికరాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో అందజేశారు. మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన హెల్త్ క్యాంపు లో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు లక్ష్మి కి వినికిడి లోపం ఉందని, సమస్య పరిష్కారం కోసం వినికిడి యంత్రాన్ని వినియోగించాలని సూచించారు. ఆర్ధికంగా అంత స్థోమత లేని లక్ష్మి కి ప్రైమ్ రి హాబ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో వినికిడి యంత్రం అందజేసేందుకు ముందుకొచ్చి అందజేయడం పట్ల డాక్టర్ హారిక ను శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ బీ ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, మక్తాల ఫౌండేషన్ అద్యక్షుడు జలందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

