వాహనాలకు ప్రమాద బీమా ను కలిగి ఉండటం తప్పనిసరి అని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ ఇన్స్పెక్టర్ వి రామచందర్ అన్నారు శనివారం బేగంపేట టిటిఐ ఆధ్వర్యంలో బేగంపేట లోని హోటల్ తాజ్ వివాంతా లో సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలపై ఇన్స్పెక్టర్ రామచందర్ అవగాహన కల్పించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు .రోడ్డు ప్రమాదాలు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు నెంబర్ ప్లేట్లను విరగగొట్టడం దానికి మాస్కులు అడ్డంపెట్టడం లేదా చేతుల్ని అడ్డం పెట్టడం చేస్తున్నారని ఇది చట్టరీత్యా నేరం అన్నారు హైదరాబాదులో 20 23లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన 52382 కేసులు నమోదయ్యాయి అన్నారు 20 22 తో పోలిస్తే ఈ సంఖ్య 86% పెరుగుదలను సూచిస్తుంది అన్నారు ఎక్కువ మంది యువకులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూనే ఉన్నారని గతంలో నివసించలేకుండా డ్రైవింగ్ చేస్తే రూ 500 మాత్రమే జరిమానా ఉండేదని ఇప్పుడు అది 5000 వరకు విధించవచ్చని మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారని అన్నారు 2023లో 61 73 మంది 20 24 సంవత్సరంలో 3300 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి టిటిఐ బేగంపేట లో కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు 2023వ సంవత్సరంలో 23 70 ప్రమాదాలు జరిగాయని ఇందులో 280 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో 121 మంది పాదచారులు ఉన్నారని ఆయన తెలిపారు పాదచారులు రోడ్డు దాటేటప్పుడు తప్పకుండా జీబ్రా లైన్ వద్ద మాత్రమే దాటాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో 150 మంది వివాంటా హోటల్ సిబ్బంది సెక్యూరిటీ మేనేజర్ సత్యం పిసి ఆయాన్ హెచ్ జి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు .


