దర్శి లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షుడు తమ్మవరపు ఫణిబాబు ఆధ్వర్యంలో ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని ఏడు అంగన్వాడీ కేంద్రాలకు శనివారం కుర్చీలు అందచేశారు. ఏడు అంగన్వాడీ కేంద్రాలకు రూ.40 వేల విలువ చేసే 150 కుర్చీలను అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ జిల్లా గవర్నర్ గోపీచంద్ చేతులమీదుగా వీటిని అందించారు. లయన్స్ జిల్లా వైస్ గవర్నర్ లు హరిప్రసాద్, లక్ష్మీనారాయణ, విజయకుమార్ రెడ్డి సుబ్బయ్య, రామాంజనేయులు, రామారావు, సత్యనారాయణగుప్తా, అశోక్, సీడీపీవో సిహెచ్ భారతి, సూపర్వైజర్ సునీత, కార్యకర్తలు సావిత్రి ,రాధాప్రియ ,చైతన్య భారతి, ప్రసన్న లక్ష్మి, విజయలక్ష్మి, వెంకటరమణ , గాలేమ్మ తదితరులు పాల్గొన్నారు.


