తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఏపి మీడియా అకాడెమీ విశ్రాంత సెక్రటరీ మామిడిపల్లి బాల గంగాధర్ తిలక్ ను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మంగళవారం తిలక్ కు నియామక పత్రం అందజేశారు. మీడియా రంగం తోపాటు ప్రభుత్వ అధికారిగా ఆయన సుధీర్ఘ అనుభవం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి, రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మేడవరపు రంగనాయకులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమానికి, అదేవిధంగా రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన సేవలను గుర్తించి ఇంతటి పెద్ద బాధ్యతను తనపై ఉంచినందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం తిలక్ ను మేడవరపు రంగనాయకులు మరియు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు బోడపాటి సుబ్బారావు, కె. నారాయణ, సాయి చంద్ తదితరులు దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ను ఆ సంఘం గౌరవ అధ్యక్షులు మామిడిపల్లి బాల గంగాధర్ తిలక్ దుశ్శాలువ తో సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.

