తాళ్లూరు మండలంలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరులో వెల్లంపల్లి రోడ్లో వైఎస్సార్విగ్రహం వద్ద, కొర్రపాటి వారిపాలెం, తూర్పుగంగవరం, కొత్తపాలెం, రమణాల వారి పాలెంలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి ఆయన అభిమానులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. మిగిలిన వైఎస్సార్ విగ్రహాలు ఉన్న అన్ని గ్రామాలలో వైఎస్సార్ విగ్రహాలకు అభిమానులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాలలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ జీ వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బారెడ్డి, సర్పంచిలు మేకల చార్లేస్ సర్జన్, చిమటా సుబ్బా రావు, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మాజీ సర్పంచి అంజి రెడ్డి, కోట మన్నే రెడ్డి, జయ రామిరెడ్డి 1, బ్రహ్మా రెడ్డి, శరత్, మేడగం చంద్రశేఖర్ రెడ్డి, కొర్రపాటి శరత్, సంగం ధర్మేంద్ర, మార్టిన్ లూధరన్, నవీన్, గణేష్, గౌతమ్, తూర్పుగంగవరంలో మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి, యాడిక యలమందా రెడ్డి, సయ్యద్ లతీఫ్, శ్రీనివాస రెడ్డి, విఠలాపురంలో సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
