విజయవాడ వరద బాధితులకు మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆయన సోదరులు శిద్ధా హనుమంతరావు, శిద్ధా సూర్యప్రకాశ్ రావులు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి రూ. 50 లక్షల విరాళం అందించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ తో కలిసి విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి రూ. 50లక్షల చెక్కులు అందజేసారు. వరద బాధితులకు అండగా నిలుస్తూ రూ. 50లక్షల చెక్కును అందజేసిన మాజీ మంత్రి శిద్ధాను ఆయన సోదరులకు సీఎం చంద్రబాబు అభినందించారు.
