బేగంపేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభిషేక్ అడపా……..

బేగంపేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభిషేక్ అడపా అన్నారు. ఆదివారం బేగంపేట డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అభిషేక్ ఆడపా మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో బేగంపేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు ప్రతి సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ కార్యకర్తను కలుసుకొని వారి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు పార్టీ బలోపేతానికి బూతు స్థాయిలో ఉన్న కమిటీలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత పెరిగింది అన్నారు అలాగే సంక్షేమ పథకాలు అందించే దిశగా అడుగులు వేయడాన్ని ఆయన అభినందించారు రానున్న రోజుల్లో డివిజన్ పరిధిలోని అన్ని బస్సుల్లో పర్యటించి క్యాడర్ను మరింత బలోపేతం చేస్తామన్నారు ఈ సమావేశంలో సనత్ నగర్ నియోజకవర్గం మాజీ బి బ్లాక్ అధ్యక్షుడు షేక్ గౌస్ , నాయకులు హనీఫ్ ఖాన్ లక్ష్మణ్ సాయికుమార్ నసీరుద్దీన్ అడ్డు మునీర్ ఖాన్ చిరంజీవి అల్తామాష్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *