జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా బూచేపల్లి వెంకాయమ్మ పదవి బాధ్యతలు చేపట్టి నేటికీ మూడు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి మహిళ నాయకురాలు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మేడికొండ జయంతి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పదవి బాధ్యతలు చేపట్టిన నాటినుండి ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఎంతో కృషి చేసిందని ఈ సందర్భంగా మేడికొండ జయంతి కొనియాడారు.
