వారు ఇరువురు ఒకే గ్రామానికి చెందిన వారు. పైగా బంధువులు, ఇతర దేశాలలో వెళ్లి బాగా చదవి స్థిర పడాలని కల కన్నారు. అందులో ఒకరు ముందుగా వెళ్లి చదువుకుని చిన్న పాటి ఉద్యోగం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వారి బంధువైన మరోక విద్యార్థి అతనికి నమ్ముకుని ఇతర దేశాలకు పయనమైనది. ఆమె తల్లిదండ్రుల సైతం గ్రామస్తుడిని నమ్మి నగదుకు అతని అకౌంట్లో జమ చేశారు. అయితే అక్కడే కథ అడ్డం తిరిగినది… ఆమె విదేశాలకు వెళ్లిన తర్వాత సరియైన రెస్పాన్స్ లేక పోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వాపోయినది. సరే ఎలాగోలా అజ్జస్ట్ అయినా సరే సంవత్సరాలు గడిచినా తాము ఇచ్చిన నగదుకు సమాధానం లేక పోవటంతో నలుగురిలో పెట్టారు. పంచాయితీలు చేసారు. అయినా సరే కొలిక్కి రాలేదు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంబొట్ల పాలెంలో జరిగినది. బాధిత విద్యార్థి తండ్రి తుపాకులు వెంకటేశ్వర్లు అదే గ్రామానికి చెందిన మీసాల కోటేశ్వర రావు పెద్ద కుమారుడు శివాజీకి చెందిన అకౌంట్లో నగదు రూ. 10 లక్షలు కోటేశ్వర రావు సమక్షంలో చేసి విద్యార్థిని చదువు నిమిత్తం లండన్ పంపామని చెబుతున్నారు. అయితే నగదు తన కుమార్తెకు ఖర్చు చేయక పోవటంతో ఆమె ఇబ్బదులు పడ్డా సరే… రెండు సంవత్సరాల గడిచినా సరే… నగదు వాపస్ ఇవ్వక పోవటంతో నగద ఇవ్వాలని తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సెప్టెంబర్ 7వ తేదిన.. తుపాకుల వెంకటేశ్వర్లు. మీసాల కోటేశ్వర రావు అడుగగా ఆ విషయమై వారి మధ్య వాదోపవాదాలు జరిగి ఘర్షణ జరిగినది. దీంతో వెంకటేశ్వర్లు కు గాయాలు కాగా వైద్యశాలలో చేరాడు … వైద్యశాల నుండి అందిన సమాచారం మేరకు బాధితుని ఫిర్యాదు మేరకు మీసాల కోటేశ్వర రావు, ఆయన కుమారుడు మణి ఉరఫ్ మణికంఠలపై తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
విదేశాల ఉన్న విద్యార్థికి వారి తండ్రి ఇచ్చిన ఫీజు చెల్లించని తోటి గ్రామస్తుడు – చెల్లించని నగదు ఇవ్వాలని కోరిన బాధిత విద్యార్థి తండ్రి – ఆగ్రహించి దాడి చేసిన నిందితుడు తండ్రి కేసు నమోదు
01
Oct