మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మంజూరై నిర్మించనున్న గోకుల్ షేడ్ల నిర్మాణంపై రైతులకు శుక్రవారం ఎంఎన్ఎస్ఈజీఎస్ కార్యాలయంలో అవగాహన తరగతులు నిర్వహించారు. ఎపీఓ మురళి మాట్లాడుతూ… మండలంలో 25 షేడ్లు మంజూరు అయినట్లు ఒక్కోక్క షేడ్ కు రూ.2.30 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. షేడ్ ల బేస్ మట్టం నిర్మించాల్సిన విధానంపై చర్చించారు. ఈసీ ప్రసాద్, టిఏ లు రమేష్, గురు బాబు, కోటేశ్వర రావులు పాల్గొన్నారు.

