పల్లెల ప్రగతే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని మండల టిటిపి అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి అన్నారు. మండలంలోని విఠలా పురం గ్రామం లో గురువారం పల్లె పండుగ – ప్రగతి అండగా కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ. 20 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. టిడిపి నాయకులు మానం రమేష్, నువులూరి సురేంద్రమోహన్, ఎంపీడీఓ సుందర రామయ్య, ఎపీఓ మురళి, ఆయా గ్రామాల నాయకులు, గ్రామకార్యదర్శు పాల్గొన్నారు.
