ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధన్యతను ఇస్తూ
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
గురువారం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ లతో కలసి ఒంగోలు లోని రిమ్స్ ను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపి గదులను, అత్యవసర సేవా విభాగంను, ఫిజియోధెరిపి యూనిట్ ను, బ్లడ్ కలెక్షన్ యూనిట్ ను, ఎన్టిఆర్ వైద్య సేవల కౌంటర్ ను, కాన్పులు, పిల్లల వార్డులను తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణపై వైద్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మంత్రి, వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సంధర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ .. జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులతో కలసి రిమ్స్ ను విజిట్ చేయడం జరిగిందని, సిబ్బందిలో కొంత అలసత్వం, పారిశుద్ద్యంలో కొంత మేర లోపాలతో పాటు వీధుల నిర్వహణలో సిబ్బంది మద్య సమన్వయ లోపం కూడా గుర్తించడం జరిగిందన్నారు. ఈ లోపాలను సరిదిద్దుకొనుటకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రధానమైన ఈ ఆసుపత్రి కి దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారన్నారు. వైద్య సేవలు కూడా కొంత సంతృప్తిగా వున్నాయన్నారు. వార్డుల్లో వున్న లోపాలను పై స్థాయి అధికారులకు తెలియచేయడంలో సమన్వయ లోపం వుందన్నారు. రిమ్స్ లో రోగులకు అవసరమైన రేర్ గ్రూపు లకు ప్రవేట్ బ్లడ్ బ్యాంక్ ల నుండి సేకరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్నీ చర్యలు తీసుకునేలా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు, వైద్యులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించేలా అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ .. రిమ్స్ లో ఓ పి పెరిగేలా, మెరుగైన వైద్య సేవలు ఆందించేలా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుతుందన్నారు. ఈ రోజు గైనిక్ వార్డులను, కొన్ని విభాగాలను పరిశీలించడం జరిగింది. వైద్య సేవలు అందించడంలో సంతృప్తి గా వున్నప్పటికినీ, శానిటేషన్ సెక్యూరిటీ విషయాలో కొన్ని పిర్యాదులు రావడం జరిగిందని, వీటిని సరి చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సుపరింటెండెంట్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన బ్లడ్ ను ప్రవేట్ బ్లడ్ బ్యాంకు లనుండి పొందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
మంత్రి వెంట ఆసుపత్రి సుపరింటెండెంట్ డా దుర్గాదేవి, డిప్యూటీ సూపరింటెండెంట్స్, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.







