గత ప్రభుత్వంలో నిర్వహించిన రీ సర్వేలో లోపాలను గుర్తించి సవరించటానికి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వక్తలు తెలిపారు. మల్కాపురం పంచాయితీ పరిధిలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. ఇప్పటికే రీ సర్వే పూర్తి కావటంతో రైతులు వారి భూమి విస్తీర్ణా లు, హక్కులు వివరాలు తప్పుగా నమోదు అయి ఉన్నట్లయితే తమ పరధిలో పరిష్కంచి వాటిని తాము పరిష్కరిస్తామని, పరిష్కరించలేని వాటిని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కానికి కృషి చేస్తామని తహసీల్దార్ నాగలక్ష్మి తెలిపారు. సర్పంచి వలి, ఎంపీటీసీ మేడగం వెంకట రామి రెడ్డిలు పాల్గొని పలువురు రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను ప్రస్తావించారు. పలు సమస్యలపై 27 దరఖాస్తులను రైతులు అందించారు. రీ సర్వే డి. టి ప్రశాంత్, విఆర్ఓ నాగూర్ బి, ఇంచార్జి సర్వేయర్ మల్లిఖార్జున రావులు పాల్గొన్నారు.
