వాహనదారులు తస్మాత్ జాగ్రత్త!!

మీరు చేయని తప్పుకు కూడా ట్రాఫిక్ నిబంధనల ఈ చలానా మీకు రావచ్చు, అప్రమత్తంగా ఉండండి. మీ బండి రిజిస్ట్రేషన్ నంబరు పెట్టుకొని మీ ఊరికి వందల కిలోమీటర్ల దూరంలో కూడా కొందరు ఆగంతకులు చేసే దుర్మార్గపు పనులకు, మరి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు మీరు బాధ్యులవుతారు. కారణం మీ బండి నంబరు అక్కడ వారు ఏదో ఒక బండికి పెట్టుకుని తిరగడమే…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అంతేకాదు చలానా నమోదులో ఒక్క అక్షరం తేడాతో పోలీస్ అధికారులు చలానా విధించగలరు.

ఇలాంటి చలానా మీరు అందుకున్నారా!! మీరు ట్రాఫిక్ రూల్స్ ని పాటించే ఎంత నిజాయితీపరులైనా మీ జేబులో డబ్బులు కట్టవలసి వస్తుంది.

ఇలాంటి వాటిని మనం ఎలా నిరోధించాలి, ఎలాంటి సాక్షాలు అధికారులకు చూపించాలి. ఆ చలానా నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ఆలోచించుకోవాలి.

ఇలాంటి సంఘటన ఒంగోలులో మీడియా విలేఖరి రాధా రమణ గుప్తా జంధ్యం కు అనుభవమైనది. అక్టోబరు 24వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:33 గం.లకు వాహన్ మెసేజ్ రాగా చూసుకుని హతాసుడైన ఆ విలేఖరి నేను రూల్స్ వ్యతిరేకించే వాడిని కాను, నగర పరిధిలో 30 కిలోమీటర్ల స్పీడు కంటే ఎక్కువ పోను, నో పార్కింగ్ దగ్గర బండి నిలపను, త్రిబుల్ రైడింగ్ చెయ్యను, అన్ని పత్రాలు దగ్గర ఉంచుకునే నేను ఇలా చలానా బారిన పడటానికి కారణం ఏమిటని, మా షాపు వద్ద బండి పెట్టుకొంటే పెనాల్టి వేసి ఈ. చలాన పంపారా అని “ఇలాగైతే ఎలా సారూ!!” అంటూ వార్త రాయడం కూడా జరిగింది. కానీ ఎందుకో మరింతగా సోధించి “వెహికల్ ఇన్ఫో యాప్” లో వచ్చిన ఈ చలానా తాలూకు నెంబర్ను పొందుపరిచి చూడగా ఒంగోలు కి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురం జిల్లా, బళ్లారి రోడ్డులో స్కూటర్ పై ముగ్గురు పోతున్న చిత్రం కనబడి ఆశ్చర్య పోయాడు. కారణం నేను ఇంతవరకు అనంతపురం జిల్లా నే వెళ్లలేదు, నా బండి హోండా కంపని సిబి షైన్ మోటార్ సైకిల్ అలాంటిది ఆగంతకులు అక్కడ నా బండి రిజిస్ట్రేషన్ ను వారు వాడుకుంటూ ప్రభుత్వాన్ని, ప్రజలను, ఆఖరికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఓనర్ అయిన నన్ను మోసం చేసి తిరుగుతున్నారని రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు. ట్రాఫిక్ నిబంధన వరకైతే పర్లేదు రేపు వారు ఏదైనా నేరం చేస్తే అన్న ఆలోచన వస్తేనే భయం కలుగుతుందని అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కు స్పందనలో మరియు పోలీస్ అధికారులను సంప్రదించి ఇలాంటి నేరాలు అరికట్టాలని వినతిపత్రం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *