దర్శి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ గా తాళ్లూరు మండల వాసి కైపు

దర్శి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ గా తాళ్లూరు మండలం విఠలాపురం వాసి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి ని నియమిస్తూ ఆపార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. క్రిష్ణా రెడ్డి గత ఎన్నికలకు ముందు దర్శి నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలని అంటూ నియోజక వర్గ వ్యాప్తంగా పాద యాత్ర నిర్వహించారు. వైసీపీ ప్రధాన మద్దతు దారు వర్గదారుడైన క్రిష్ణా రెడ్డి ఆ వర్గంలోని తన మద్దతు దారులను బయటకు తీసుకువచ్చి పార్టీ అభ్యున్నతికి కృషి చేసారు. అందుకు సంబంధించిన పూర్తి నివేదికను అధిష్టానానికి చేరటంతో ఆయన సేవలను గుర్తించిన పార్టీ కీల బాధ్యతలు అప్పగించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తనకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి, పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామా రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా మరియు ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *