చీమకుర్తి మండలం బండ్లమూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల యందు కీర్తిశేషులు మార్తుల బాలరెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు వెంకారెడ్డి మరియు తిరుపతి రెడ్డి పాఠశాల విద్యార్థులకు ఫ్యాట్స్, పెన్స్,పెన్సిల్లు మరియు స్కేలు తదితర పరికరములను రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి తరుపున బహుకరించారు.ఈ కార్యక్రమానికి స్కూలు హెడ్ మాస్టర్ టి.ఎల్ కాంతారావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కడవా రామకృష్ణ, సెక్రెటరీ కే.వీ సుధాకర్,మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీలు పోకూరి రామకృష్ణారెడ్డి, మన్నం నాగరాజు,వీరారెడ్డి మాస్టారు,పరంకుశం శ్రీనివాసమూర్తి,మార్తుల తిరుపతి రెడ్డి,వెంకారెడ్డి,నాగెళ్ళ సత్యం, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు శిద్దా సుధాకర్, ఎస్ఎంసి చైర్మన్ గడ్డం రమేష్, బండ్లమూడి వైస్ సర్పంచ్ గోపిరెడ్డి పద్మా ఓబుల్ రెడ్డి, బండ్లమూడి ఎంపీటీసీ యానం విజయలక్ష్మి శేషిరెడ్డి, అభివృద్ధి కమిటీ సభ్యులు వనిపెంట పిచ్చిరెడ్డి, పెమ్మా నర్సింహారావు,వనిపెంట శ్రీనివాస్ రెడ్డి,గోపిరెడ్డి వెంకారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
