ఆంద్రప్రదేశ్, అమెరికన్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి ముగ్గులపోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు హిమబిందు చేకూరి, హరి మోటుపల్లి, బాలాజీ వీర్నాల, గిరీష్ ఇయ్యపు తెలిపారు ఈ పోటీలలో పాల్గొనటానికి ఎటువంటి రుసుం లేదన్నారు. విజేతలకు భారీ నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. ప్రథమ బహుమతిగా రూ.25 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.15 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.10 లక్షలు, నాల్గవ బహుమతి రూ.5 లక్షలు, ఐదో బహుమతిగా రూ.2 లక్షలు ఉంటాయన్నారు. అసోసియేషన్ లింక్ ద్వారా ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, డిసెంబరు 1 నుంచి జనవరి 15 వరకు ముగ్గుల వీడియోలు పంపవచ్చని వారు పేర్కొన్నారు.

