ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థునులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటూ ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం జ్వరాలు, జలుబు, తలనొప్పి, రక్తహీనత ఇతర సమస్యలతో బాధపడుతున్నా …సరే వారికి సరైన వైద్యం అందక అనారోగ్యం పాలవుతూ రక్తహీనతతో బాధపడుతున్నారు. పాఠశాలలో ఆరోగ్య కార్యకర్త ఉన్నా సరే సరైన మందులు లేక విద్యార్థులకు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. అనారోగ్యం పాలైన సరే తల్లిదండ్రులకు సరియైన సమాచారం లేక పోవటంతో వారు సైతం బిడ్డలను చూడలేని దుస్థితి నెలకొన్నది. ఇక తీవ్ర సమస్య ఉత్పన్నమైతే తప్ప మాకు తెలియపటం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులలో రమణాల వారి పాలెంకు చెందిన సైమన్ కుమార్తె మెర్యాని రక్త హీనతో 4 గ్రాములు మాత్రమే ఉండి మంచం పాలై సోమవారం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఇటువంటి వారు ఇంకా కొంత మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు సరైన వైద్యం అందించి ఆరోగ్యాలను మెరుగు పరచేలా తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సకాలంలో సమాచారం ఇవ్వాలి – సైమన్, తండ్రి, రమణాల వారి పాలెం :

నాబిడ్డ మెర్యానీకి పూర్తిగా ఆరోగ్యం క్షీణించే వరకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వక … ఇబ్బందికర పరిస్థితులలో సమాచారం ఇస్తే ఎమి చెయ్యాలి. జ్వరం ఒకటి రెండు రోజుల తగ్గక పోతే తప్పనిసరిగా సమాచారం ఇస్తే మెరుగైన వైద్యం చేయించుకునే వీలుంటుంది. ప్రస్తుతం నాబిడ్డ మంచం పాలైనది. ఇంకా ఐదుగురు వరకు ఇదే పరిస్థితి ఉన్నదని తెలుస్తుంది. బిడ్డలను న్యాయం జరిగేలా చూడాలి.