కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ను సందర్శించిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్స్ – మిడ్ వైవ్స్ ప్రతినిధులు……………అధునాతన ఆరోగ్య సంరక్షణ విధానాలు, చికిత్సలపై అవగాహన……..

అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్స్ – మిడ్ వైవ్స్ ప్రతినిధుల బృందం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ను ఆదివారం సందర్శించారు. వైద్యరంగంలో అవలంబిస్తున్న చికిత్స పద్ధతులు, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. హాస్పిటల్ లో శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ, వైద్య సదుపాయాలతో అందిస్తున్న చికిత్స విధానాలను అడిగి తెలుసుకున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్స్ మిడ్వైవ్స్ డెలిగేషన్ ప్రతినిధి డా. కేథరీన్ కాలిన్స్-ఫులియా తో పాటు ప్రతినిధి బృందానికి కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్‌, హాస్పిటల్ నర్సింగ్ సూపరిండెంట్ షైనీ చేరియన్ తో కలిసి చర్చించారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందజేస్తున్న కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ను సందర్శించి ఆధునిక వైద్య సేవల చికిత్స విధానాలను తెలుసుకోవడం తమకెంతో ఉపయోగపడుతుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్స్ – మిడ్ వైవ్స్ ప్రతినిధుల బృందం డా. కేథరీన్ కాలిన్స్-ఫులియా తెలిపారు. ఈ సందర్భంగా ప్రతినిధుల బృందాన్ని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిలేషన్స్ హెడ్ గోకుల్ ప్రేమ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *