హైదరాబాద్, డిసెంబర్ 13 (జే ఎస్ డి ఎం న్యూస్)
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 441 దరఖాస్తులు అందాయి. వీటిలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 110, మైనార్టీ సంక్షేమ శాఖ సంబంధించి 76, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 71, విద్యుత్ శాఖ కు సంబంధించి 57, హోం శాఖ కు సంబంధించి 23, ఇతర శాఖలకు సంబంధించి 104 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


