ఇంటర్మీడియట్ విద్య కోసం దరఖాస్తు చేసుకోండి – జీ.బి.కె సీ.టి ఒంగోలు సర్కిల్ ఇన్చార్జి షేక్ వలీ బాష

గయాసుద్దీన్ బాబు ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ (జి బి కే) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇన్టిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (హెచ్ ఈ ఐ) జూనియర్ కళాశాల వికారాబాద్ లో ఇంటర్మీడియట్లో ఉచిత సీటు కోసం పేద ప్రతిభావంతులైన విద్యార్థులు 2025 జనవరి 25 వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించబడునని హెచ్. ఐ . ఈ డైరెక్టర్ జావేద్ హుద్ అన్నారు. ఒంగోలులో సోమవారం జి బికే కార్యాలయంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆన్లైన్ దరఖాస్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టీ జావెద్ హుద్ మాట్లాడుతూ హెచ్ ఐ ఈ కళాశాల 13 సంవత్సరాల నుండి నాణ్యత ప్రమాణాలతో నడుపుతున్నామని తెలిపారు. ఉచిత వసతి, భోజన సౌకర్యాతో కల్పిస్తున్నామని అన్నారు. కుల మతాలకు అతీతంగా విద్యార్థులు 125 సీట్లకు ఈ పరీక్షలు వ్రాసి విద్యార్థులు ఎంపిక కావాలని అన్నారు. ఎంపీసీ బై పీ సీ, ఎం ఈ సీ కోర్సులు తమ కళాశాలల్లో ఉచితంగా విద్యా బోధన చేస్తామ న్నారు. దీనితో పాటు జెఈఈ మెయిన్స్, నీట్, ఎం సెట్ (ఐఐ టీ, ఎన్ ఐ టీ, ఎం బీ బీఎస్, ఎంఈ సీ కోసం ఇంటిగ్రెడెట్ కోచింగ్ తో ఇంటర్మీడియట్ కోసం పూర్తి రెసిడెన్షియల్ ప్రొగ్రాం కలిగి ఉందని అన్నారు. మరింత సమాచారం కోసం జీ.బి.కె సీ.టి ఒంగోలు సర్కిల్ ఇన్చార్జి షేక్ వలీ బాష సెల్ నంబర్ 9866556846ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో నిసార్ అహ్మద్, బాబా ప్రకుద్దీన్, ఒంగోలు సర్కిల్ ఇన్చార్జి వలి బాష తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *