వైసీపీ నాగంబొట్ల పాలెం బీసీ సెల్ అధ్యక్షుడు మూర బోయిన తిరుపతయ్య పార్టీకి రాజీనామా చేసినట్లు బుధవారం ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో విడదీయ రాని సంబంధం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి కుటుంబానికి వీర విధేయుడిగా గ్రామంలో పేరుంది. అయితే పార్టీకి సంబంధించిన విషయాలు గాని, కార్యక్రమాలు గాని తమకు సరియైన సమాచారం, ప్రాధాన్యం లేక పోవటంతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. రాబోవు రోజులలో తన రాజకీయ జీవితం గురించి చెబుతానని ఆయన తెలిపారు.
