కొర్రపాటివారిపాలెం కొండ మట్టిని
హైవేరోడ్డు నిర్మాణ నిర్వహకులు తరలిస్తుండగా గ్రామంకు చెందిన 20 మందికి పైగా పశువుల కాపరులకు చెందిన మహిళలు అడ్డుకున్నారు. రోడ్డు నిర్వహకులు పర్మిషన్ వుందన్నా వినలేదు. తాము పేద వర్గాల వారిమని, తమకు గ్రామంలో ఎలాంటి అస్తిపాస్తులు లేవని, గొర్రెలు, మేకలు, పశువులపై ఆధారపడి జీవిస్తున్నా మని, కొండపై వున్న మేతకు మేపుగా వస్తుంటాయని, కొండ మట్టి తరలించేదులకు సమాచారం ఇచ్చారు. దర్శి సర్కిల్ పరిధిలోని సీఐ రామారావు నేతృత్వంలో దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు ఎస్సైలు, ఏస్సైలు, పోలీసులు, మహిళా పోలీసులు దాదాపు 50 మంది పోలీసులుకొండ వద్దకు చేరుకున్నారు. దర్శి సీఐ రామారావు కొండ వద్దనుండి మహిళలను వెళ్లి పోవాలని, రోడ్డునిర్మాణం కోసం ప్రభుత్వం మట్టితీసుక వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని, అడ్డుకుంటే చట్ట పర చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. మహిళలు వినక పోవటంతో మహిళా పోలీసులతో అక్కడ నుండి పంపివేశారు. తదుపరి యధాప్రకారం రోడ్డు నిర్మాణం కోసంవటం జరుగుతుందని తెలిపారు. మహిళలు వినక పోవటంతో మహిళా పోలీసు లతో అక్కడ నుండి పంపివేశారు. తదుపరి యధాప్రకారం రోడ్డు నిర్మాణం కోసం మట్టిని తరలించారు.
