క్యాన్సర్ వలన కలిగే ప్రమాదాలను ప్రజలకు అవగాహన కలిగించాలి – ఆరోగ్య, ఆశ కార్యకర్తల సమావేశంలో తూర్పు గంగవరం పిహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక .

క్యాన్సర్ వలన కలిగే ప్రమాదాలను ప్రజలకు అవగాహన కలిగించి వారికి తగిన వైద్య సదుపాయం కల్పించే అవకాశం కల్పించాలనితూర్పు గంగవరం పిహెచ్ సి వైద్యాధికారిణి
వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక అన్నారు. . తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల నందు మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆశ ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ ….పొగాకు, పాన్ పరాగ్, గుట్కా, రాజా ఖైని తదితర పొగాకు సంబంధిత వస్తువులను ఉపయోగించడం వల్ల నోటి క్యాన్సర్, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లు వ్యాపించే అవకాశం ఉందని దీనివల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి క్యాన్సర్ నుండి బయటపడడానికి ప్రజలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె తెలిపారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి బసవా రెడ్డి మాట్లాడుతూ…. మలేరియా, చికెన్ గునియా తదితర వాటి బారిన పడకుండా ప్రజలు దోమతెరలు ఉపయోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల వైద్యులు డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఈ ఓ కే చంద్రశేఖర్ బాబు , పీహెచ్ యన్ .యం.వి రమణమ్మ, హెచ్ వి సుశీల, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్ పి లు, ఆశ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *