రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఈడబ్యుఎస్,కాపు
లకు రుణాలు మంజూరు చేస్తున్నందున అర్హతగల లబ్ధిదారులు ఈనెల 6 వ తేదీ లోపు ఆన్ లైన్ లో ధరఖాస్తులు పెట్టుకోవాలనిజిల్లా బీసీకార్పోరేషన్ ఈ డీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఆయన రుణాల ధరఖాస్తుల ఆన్లైన్ వివరాలు తెలుసుకునేందుకు ఎంపీడీవో కార్యాలయం, గ్రామ సచివాలయంను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జిల్లాలో1219 యూనిట్లకు 24కోట్ల 68లక్షల రుణాలు. 2,569 మంది లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగాస్వయ ౦ ఉపాధి పధకం కింద బీసీలకు) 1195 యూనిట్లు, జనరిక్ మెడికల్షాపులకు 24 యూనిట్లు, ఈడబ్ల్యుఎస్ కింద 486 యూనిట్లు, జనరిక్ మెడికల్షాపులకు 83 యూనిట్లు, కాపులకు 188 యూనిట్లు మంజూరయినట్లుతెలిపారు. ఆన్లైన్లోవచ్చిన దరఖాస్తులను ఈనెల 7నుండి 11 వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయం లో పరిశీలన చేస్తారన్నారు. 16 వ తేదీ జిల్లా బీసీ కార్పోరేషన్ కార్యాలయంకు చేర తాయని 23 ఎంపిక కాబడిన లబ్ధిదారుల జాబితాను వెల్లడించటం జరుగుతుందని, మార్చి10 వ తేదీన యూనిట్లను గ్రౌడిండ్ చేయటం జరుగుతుందని తెలి పారు. అ ర్హత గలలబ్ధిదారులు రుణాలు పొందేందుకు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని 6 వ తేదీలోపు ధరఖాస్తులను ఆన్లైన్ చేయాలని తెలిపారు. ఆన్లైన్ ధరఖాస్తులు ఏఏ యూనిట్లుకు పెట్టుకోవాలో వివరించారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీవో డి.హనుమంతరావు, సీడీపీవో సిహెచ్ భారతి, ఎంఈవో జి.సుబ్బయ్య అడ్మిస్ట్రేటివ్ అధికారి ఎస్ .సత్యం, తదితరులు పాల్గొన్నారు.
