ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపధ్యంలో నీటి వనరులకు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. బొద్దికూర పాడు, వెలుగు వారి పాలెం రైతు సేవా కేంద్రాల వరధిలో పోలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వంటలు అన్ని చేతికి అందే దశలో ఉన్నాయని నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వశు సంవర్ధక శాఖ ద్వారా వశుపోషకులకు మందులు అందించారు. ఉప సర్పంచి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, నీటి సంఘం అధ్యక్షుడు చిన కోటి రెడ్డి, ఉపాధ్యక్షుడు పెద నాగి రెడ్డి, రమణా రెడ్డి, సూరా రెడ్డి, అంజి రెడ్ది, క్రిష్ణా రెడ్డి, వి ఏ ఏ అజ్మీర్, సుష్మ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
