తాళ్లూరు లో మోడల్ పాఠశాలలపై అవగాహన

తాళ్లూరు లోఎం. అర్ . సీ కార్యాలయంలో 117 జీఓ రద్దు, మోడల్ పాఠశాలల ఏర్పాటు గురించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఓ జి సుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మోడల్ పాఠశాలలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని, ప్రధానోపాధ్యాయులు వీటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలోతహశీల్దార్ ఇమ్మానియేల్ రాజు, ఎంపిడిఓ హనుమంతరావు, ఎంఇఓ -2 ఎల్ సుధాకర్ రావు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *