జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి మండలంలోని శివరామపరంలో పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శివరామపురంలో వైఎస్సార్సీపీ నాయకులు ఉప్పుటూరు బ్రహ్మయ్య నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు ఆలోకం హరిబాబు కుమారుని యశ్వంత్ జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి మారం ఇంద్రసేనా రెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన రెడ్డి, గోళ్లపాటి మోషే, ఐవీ సుబ్బా రెడ్డి, గుజ్జుల యోగి రెడ్డి, పులి క్రిష్ణా రెడ్డి, కటకంశెట్టి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

