రామభద్రాపురంలో రీసర్వేను పరిశీలించిన తహసీల్దార్

తాళ్లూరు మండలంలోరామభద్రాపురం గ్రామంలో జరుగుతున్న రీసర్వేను తహసీల్దార్ ఇ మ్మానియేల్ రాజు శుక్రవారం పరిశీలించారు. రీసర్వేలో బాగంగా మండలంలోని రామభద్రాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా గుర్తించి తప్పులులేకుండారీసర్వే నిర్వహిస్తున్నారు.ఈసందర్బంగా రైతులతో మాట్లా డారు.ముందస్తుగా నోటీసులు ఇచ్చారా లేదాఅని రైతులను నడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద వున్న రికార్డులను, రైతుల సమక్షంలో పరిశీలించి హద్దులు సరిగా గుర్తి స్తున్నది లేనిది రైతుల ద్వారా తెలుసుకున్నారు. రీసర్వే సక్రమంగానే జరుగుతున్నదని రైతాంగం తెలిపారు. గ్రామంలో 50 సర్వే నంబర్లు వుండగా ఇప్పటి వరకు 30 సర్వే నంబర్లందుగల భూమికి రీసర్వే పూర్తయిందని విఆర్వో తెలిపారు.మిగిలిన రైతులు పొలాలలకు వద్దకు వచ్చి వివరాలు అందజేస్తేరీసర్వే నిర్వహించటం సులు వుగా వుంటుందన్నారు. ఈకార్యక్రమంలో మండలసర్వేయర్ వై.శ్రీనివాసరావు,ఆర్వో చంద్రశేఖర్ రావు, విలేజ్ సర్వేలు, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *