బాల్యం నుండే నైతిక విలువలతో చదువు కొనసాగించాలి.

బాల్యదశనుండే విద్యార్థులు నైతిక విలు వలు పాలిస్తూ చదువులు కొనసాగించాలని ఇంచార్జి తహౄసీల్దార్ జె. ఇమ్మానియే ల్రాజు అన్నారు. తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామంలో శుక్రవారం బంగారు బాల్యం కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాల్య దశ నుండే పిల్లలు చెడుమార్గాలవైపు వెళ్లకుండా సత్ప్రవర్తనతో ముందుకుసాగాలన్నారు. చెడువైపు వెళితే జీవితాలు, కుటుంబాలు చిధ్రమవుతాయన్నారు. బాల్య దశనుండి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకో వద్దని తెలిపారు. విద్యార్థుల అభ్యున్నత కోసం ప్రవేశపెట్టినపథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్య త్తుకుబంగారు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *