తమ పిల్లలను ఒక్కసారి చూసి.. వారికిఇంటి భోజనం పెట్టి ..వారికి అవసరమైన వస్తువులు ఇచ్చి పోదామనే ఉద్దేశ్యం తో ఆదివారం స్థానిక కస్తూర్భాగాంధీ విద్యాలయంకు చేరుకున్న తల్లిదండ్రులకు నిరాశమిగిలింది. విద్యాలయంలోపలికి వెళ్లి పిల్లలను చూసి వచ్చేందుకు అనుమతి లేకపోవడంతో… విద్యాలయం బయటకు విద్యార్థులను పంపారు. దీంతో అక్కడ వేచి ఉండటానికి విద్యార్థులను కలుసుకోవడానికి ప్రత్యేకమైన షెడ్లు లేదా గదులు లేకపోవడంతో… విద్యాలయం ప్రాంగణంలోని చెట్ల కిందే పడిగాపులు కాశారు. ప్రాంగణంలో నీడ నిచ్చే చెట్లు లేక పోవటంతో వున్న ఒకటి,రెండు చెట్లకింద కొందరు, ఎండలో కొందరు పిల్లల కోసం వుండి పోవాల్సి వచ్చింది. విపరీతమైన వేడిలో సైతం ….విద్యాలయంలోని ఉన్న తమ పిల్లలకు ఇంటిలో చేసిన ఆహార పదార్థాలను తీసుక వచ్చిన తల్లిదండ్రులు పిల్లలను బయటకు పిలిపించుకుని ఎండలో కూర్చొని వారి సంతృప్తికంగా భోజనం పెడుతూ ఇబ్బందులు పడ్డారు. బాలికలు కావటంతో వారి
తల్లులు ఎండల్లోనే వుండి పిల్లల చింపురు తలలు దువ్వుతూ అవస్థలు పడ్డారు. ఉదయం 11 గంటలకు విద్యాలయంకు వచ్చిన తల్లిదండ్రులు ఎండలోని తమ పిల్ల
లతో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యాభివృద్ధికి బాటలు వేస్తామంటున్న ప్రభు త్వాలు విద్యాలయాలకు వెళ్లి పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు సరైన వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకో పోవటంపై తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కేజీబీవీవిద్యాలయంలో పిల్లలను చూసేందుకు వస్తున్న తల్లిదండ్రులు నిరీక్షణ కోసం ప్రత్యేక సమావేశం కోసం… గదులు ఏర్పాటు చేసి తల్లిదండ్రుల అవస్థలు తొలగించాలని కోరుతున్నారు.
