కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్ .ప్రతి మహిళ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి- డాక్టర్ ఏ వి గురవారెడ్డి………………………

ప్రతి మహిళకు మానసిక స్థైర్యంతోపాటు శారీరక దృఢత్వం అవసరమని అందులో భాగంగానే బేగంపేటలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో పనిచేసే మహిళా ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది, డాక్టర్లకు సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్ ను సోమవారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏ వీ గురువారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఇతరత్రా సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ తనను తాను ఆపద సమయంలోకాపాడుకునేందుకు, ప్రతి ఒక్కరిలో మానసిక, శారీరక దారుధ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతోనే సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులందరికీ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్ లో భాగంగా శిక్షణ ప్రారంభించామని డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. మహిళలపై ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా వారే స్వయంగా ఎదుర్కొనే విధంగా యోధ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందిన మాస్టర్ అజయ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులను సంస్థలో పనిచేసే ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని సూచించారు. సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్ లో తమపై దాడి చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎలా ప్రతిగడించాలి, ఎలా ఎదుర్కోవాలనే వారం రోజులపాటు బ్యాచుల వారిగా శిక్షణ తరగతులు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఈ వర్క్ షాప్ లో కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య, న్యూరాలజిస్ట్ డాక్టర్ నివేదిత తో నర్సింగ్ స్టాఫ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *