దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు కడియాల డాక్టర్ లలిత్ సాగర్ లు వారి ఎమ్మెల్సీ ఓటు హక్కును నరసరావుపేటలో వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ…రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు మీ ఓటు మిస్తుందని ఊతమిస్తుందని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. విద్యావంతులైన పట్ట బద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని అభివృద్ధికి బాటలు వేయాలని డాక్టర్ లక్ష్మి పిలుపునిచ్చారు.
