కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలిబడ్జెట్ అంతా అంకెల గారడి అభూత కల్పనలతో కూడుకున్నదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మికుల ఉద్యోగుల చైర్మన్, దర్శి నియోజక వర్గ ఇన్చార్జి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నేపధ్యంలో బడ్జెట్పై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు ఇస్తామని దాదాపు 50వేల మంది నిరుద్యోగులకు మోసం చేసినదని అన్నారు. అన్నదాత సుఖీభవ పధకానికి 54 లక్షల మంది రైతులు ఎదురు చూస్తుంటే కేవలం రూ.6300 కోట్లు కేటాయించటం ఏమి టిని అన్నారు. తల్లికి వందనం కు రూ.12,600 కోట్లు కావల్సి ఉండగా కేవలం రూ. 9407 కోట్లు మాత్రమే కేటాయించటం ఎమిటిని ప్రశ్నించారు. ఉచిత బస్సు గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదని అన్నారు. దొనకొండ ఇండస్ట్రీయల్ కారిడార్కు కూడ పైసా కేటాయించలేదని ఆరోపించారు. బడ్జెట్ అంతా మసీ బూసి మారేడు కాయ చేయటమే అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మీరావలి, వెంకట రమణా రెడ్డి, కొత్తమారం శ్రీనివాస రెడ్డి, సురేష్, భాదర్ వలి తదితరులు పాల్గొన్నారు.
