చెత్త సంపద కేంద్రాలను త్వరగా ఉపయోగపడాలని ఒంగోలు డీఎల్ పీఓ పద్మ అన్నారు. తాళ్లూరులో చెత్త సంపద కేంద్రాన్ని, సచివాలయాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. పన్నుల వసూలు వేగవంతం చెయ్యాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచి మేకల చార్లేస్ సర్జన్, గ్రామ కార్యదర్శి ఐవీ రమణా రెడ్డి పాల్గొన్నారు.

