పొదుపు మహిళలకు ప్రభుత్వం బ్యాంక్ లద్వారాపలురకాల రుణాలు అందజేస్తున్నందున, బ్యాంక్ పరపతి పోకుండా తీసుకున్న రుణాలను పొదుపు మహిళలు సకాలంలో చెల్లించాలని దర్శి ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవిఅన్నారు. తాళ్లూరు
స్త్రీశక్తి భవనం నందు మండల మహిళా సమాఖ్య సమావేశం ఎంఎంఎస్ అధ్యక్షులురాలు ఎం. సుజాత అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొదుపు మహిళలు రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నందున వారిపై నమ్మకంతో బ్యాంక్లు ఎలాంటి హామీ పత్రం లేకుండా లక్షలాది రూపాయాల రుణాలు బ్యాంక్లు ఇస్తున్నాయన్నారు. ఆరుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగావృద్ధి చెందాలన్నారు. ఏపిఎం దేవరాజ్ మాట్లాడుతూ …..తీసుకున్న రుణాలు సక్రమంగా బ్యాంక్ ల యందు చెల్లిస్తున్న పొదుపు మహిళ లకు బ్యాంక్లు ఒక్కో గ్రూప్ కు రూ. 15లక్షల నుండి రూ.20లక్షల మేర ఇస్తున్నారు.
తాళ్లూరు మండలంలో 148 మహిళారైతు పొదుపు గ్రూపులు ఉన్నాయన్నారు. ఆగ్రూపులకు ప్రభుత్వం బ్యాంక్ ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నదన్నారు. కొందరు పొదుపు మహిళలు సీఐఎఫ్, స్త్రీనిధి, రుణాలు తీసుకుని చెల్లించ చెల్లించక మొండి బకాయిలుగా వున్నందున గ్రూపు సభ్యులు సమిష్టి బాధ్యత తీసు
కుని బాకీలు వసూలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు మోహన్ రావు, సుచింత్ర, సీవో కుమారి, గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు సుజాత తదితరులుపాల్గొన్నారు.

