40 ఏళ్ల పాటు చిరు నవ్వుతో రోగులకు సేవ చేయడమే గాక వైద్యుల, డాక్టర్ల మనసును చూరగొన్న ఘనత జి జి హెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 అనంతలక్ష్మికే దక్కుతుంది అని ఇంఛార్జ్ సూపరింటిండెంట్ డాక్టర్ ఎన్ కిరణ్ అనంతలక్ష్మి సేవలని కొనియాడారు. జిజిహెచ్ లో
40 సంవత్సరాల పాటు నర్సింగ్ విభాగంలో సేవలు అందించి ఉద్యోగ విరమణ చేస్తున్న చెరుకూరి అనంతలక్ష్మి సురేష్ బాబులను ఘనంగా సన్మానించారు. నర్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి మంజేష్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండల రావు పాల్గొన్నారు. అందరికీ ఆదర్శమైన విధంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడం ద్వారా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. అనంతం అనంతలక్ష్మి సురేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ అభినందన కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ కె అద్దెయ్య, డెప్యూటీ సూపరింటిండెంట్ డాక్టర్ బాలాజీ నాయక్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గా దేవి, నర్సింగ్ సూపరింటిండెంట్ సంపూర్ణమ్మ, ఏడీ లక్ష్మి కుమారి, ఉదయ లక్ష్మి, శంశాద్ బేగం, వందన, సిబ్బంది మహేష్, విజయ్, శ్యామ్, హనుమంత్, అశోక్ బ్రహ్మ నాయుడు, పెద్ద సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
