మండలంలో పెన్షన్లు 93 శాతం పంపిణీ జరిగినట్లు ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. తాళ్లూరులో నూతనంగా మంజూరు అయిన పెన్షన్లను టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు ఆదేశాలతో ఆపార్టీ నాయకులు పంపిణీ చేసారు. పార్టీ యువ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కరువది మేజర్ నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగిరెడ్డి, నాయకులు తూము నాగేంద్ర రెడ్డి, శ్రీను, గ్రామ కార్యదర్శి ఐవీ రమణా రెడ్డి, వేల్ఫేర్ అసిస్టెంట్ క్రిష్ణా రెడ్డిలు పాల్గొన్నారు.

