బేగంపేట లో ఓ వ్యక్తిపై కత్తి తో దాడి…గాయపడిన వ్యక్తిని 108 లో ఆసుపత్రికి తరలింపు.

బేగంపేట మార్చి 18(జే ఎస్ డీ ఎం న్యూస్)
బేగంపేట లో సినీ పక్కిలో ఓ వ్యక్తిని కత్తితో తరుముకుంటూ వచ్చి దాడి చేయడం తో వ్యక్తి ఎడమచేతి కి తీవ్రగాయాలయ్యాయి. రక్త మోడుతున్న చేతితోనే అతను కొంత దూరం పరిగెత్తి గగన్విహార్ కాలనీ పార్క్ ముందు పడిపోయాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో బేగంపేట భగవంతపూర్ కాలనీ గగన్ విహార్ కాలనీ పార్కు వద్ద చోటు చేసుకుంది. ఒక ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు వెంకటేష్ యాదవ్ (35 )అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి ఆ వెంటనే అదే వాహనంపై పారిపోయారు.వెంటనే
ఈ సమాచారాన్ని స్థానికులు బేగంపేట పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ యాదవ్ (35 )అనే వ్యక్తి బేగంపేట భగవంతపూర్ లో కిరాయికి ఉంటున్నాడు. ఆటో ట్రాలీ నడిపిస్తుంటాడు. మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు వెంకటేష్ యాదవ్ ఆటో ని అనుసరించి వచ్చి అతనిపై పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తులు వెంకటేష్ యాదవ్ పై ఎందుకు దాడి చేశారు. ఆర్థిక లావాదేవీలా, పాత కక్ష్యలా లేక మరేదైనా విషయం లో దాడి జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ బదన ప్రసాద్ రావు వివరాలను సేకరిస్తున్నారు. నిందితుల జాడ కోసం సిసి కెమెరాల ను పరిశీలిస్తున్నారు. దాడిలో వెంకటేష్ యాదవ్ ఎడమ చేతి పై తీవ్ర గాయాలు కావడంతో అతను కొంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి గగన్ విహారి కాలనీ పార్క్ వద్ద పడిపోయాడు. పోలీసులు నిందితులు ఎటు నుంచి వచ్చారు ఎక్కడ వెంకటేష్ యాదవ్ పై దాడి చేశారుఎటువైపు వెళ్లారు అన్న వివరాలను సేకరిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *