ఓడిన చోటే గెలిచి చూపిస్తా : డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకొని ఓడిన చోటే పట్టుదలతో పనిచేసి మళ్లీ గెలిచి చూపిస్తానని తెలుగుదేశం ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. తెలుగుదేశం, జనసేన ప్రభలపై ఆమె మాట్లాడుతూ …రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వాన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. మంత్రి నారా లోకేష్ పరిశ్రమలు తీసుకురావ డానికి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దర్శిని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. దర్శిలో దొనకొండ పారిశ్రామి కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డ్రైవింగ్ స్కూల్ కి నిదులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. దర్శిలో ఇంటింటి కోలాయి ఏర్పాటు చేసి త్రాగునీరు అందిస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు రూ.4వేలు చేసామని, మహిళలకు ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సంపద సృష్టించి అన్ని విధాలఅభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ ….ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందన్నారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో యాదవులు ఏర్పాటు చేసిన పాటకచేరిలో కూడా మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత సాగర్, చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దారం సుబ్బారావు, యాదగిరి వాసు, స్టీవెన్, పుల్లలచెరువు చిన్న పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *