సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన తమ తాతయ్య దివంగత మంత్రి గొట్టిపాటి హనుమంతరావు ఎల్ఎంబి బ్యాంకు చైర్మన్ గా, సంతమాగులూరు సమితి అధ్యక్షుని గా, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా, మార్టూరు శాసన సభ్యునిగా ప్రస్థానం సాగించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గం లో పౌర సరఫరాల శాఖా మాత్యునిగా పని చేసిన మచ్చ లేని, నిస్వార్ధ రాజకీయ నాయకునిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గొట్టిపాటి హనుమంతరావు 28వ వర్ధంతి సంద ర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళిఅర్పి స్తున్నట్లు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దివంగత మంత్రి గొట్టిపాటి హనుమంతరావు నివాళులర్పించారు .కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

