సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజాదర్బార్ – టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి ఆర్అండ్ బీ అతిథిగృహం ఆవరణలో బుధ వారం ప్రజాదర్బార్ నిర్వహించారు. దర్శి పట్టణం , వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమర్పించిన ఆర్జీ లను స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి మాట్లాడుతూ ….గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల ఇబ్బందుల గూర్చి పట్టించుకోక పోవటంతో సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను ప్రజాదర్బార్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఈ సంద ర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి 126 ఆర్జీలు దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి డీఎస్సీ బి. లక్ష్మీనారా యణ, తహసీల్దార్ ఎం. శ్రావణ్ కుమార్, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కమిషనర్ వై.మహేశ్వరరావు, ఎంపీడీవో ఎల్. కృష్ణమూర్తి, ఈవో ఆర్జీ ఆవుల సుధాకర్, విద్యుతాశాఖ ఈఈ పి. శ్రీనివాసులు, ఏడీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం

టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న కార్యక ర్తలందరికీ తగిన గుర్తింపు ఇచ్చి న్యాయం చేస్తానని టీడీపీ దర్శి నియోజ కవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ కార్యా లయంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అండగా నిలుస్తానని, పార్టీ మరింత పటిష్టతకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తెలుగు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

చెత్తద్వారా సంపద సృష్టించాలి

చెత్త ద్వారా సంపద సృష్టించేందుకు అందరూ కృషి చేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు. మండలంలోని పోతవరంలో చెత్త సంపద కేంద్రా లను ఆమె పరిశీలించారు. ఎంపీడీవో కృష్ణమూర్తి, ఈవోఆర్డీ ఆవుల సుధాకర్, సర్పంచ్ తూము దివ్వ ఉప సర్పంచ్ జి. బాలరవణమ్మ పాల్గొన్నారు..

ఇరువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన ఇరువురికి టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్చా ర్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సీఎం రిలీప్ ఫండ్ చెక్కు లను అందజేశారు. దర్శిలోని ఆమె నివాసంలో లబ్దిదారులకు బుధవారం ఈ చెక్కులు అందించారు. లక్క వరం గ్రామానికి చెందిన నన్నం అంజయ్యకు రూ.46,849 చెక్కును, ఏ.చిన్నమ్మాయికి రూ.42,324 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి మేడగం వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ లక్కవరం గ్రామ అధ్యక్షుడు బొడ్డు హనుమా రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *