సీతారాముల కళ్యాణం కమనీయం…పలు దేవాలయాలలో కల్యాణోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట ఏప్రిల్ 6(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్రీ రామ నవమి సందర్బంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజల అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ పల్లకిని మోసి పల్లకి సేవలో పాల్గొన్నారు.
బన్సీలాల్ పేట డివిజన్ లో……….
బన్సీలాల్ పేట డివిజన్ లోని పద్మారావు నగర్ పోల్ బాల్ హనుమాన్ టెంపుల్, ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీ సీతారామచంద్ర ఆలయం లలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పల్లకిని మోసి పల్లకి సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా ఐడిహెచ్ కాలనీ, జయ ప్రకాష్ నగర్,డిక్లాస్, అరుణ్ జ్యోతి కాలనీలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. పూజనల అనంతరం నిర్వహకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత, లష్కర్ జిల్లా సాధన సమితి అద్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆలయ ఈ ఓ సత్యమూర్తి, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, ప్రేమ్ కుమార్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాంగోపాల్ పేట డివిజన్ లో…..
రాంగోపాల్ పేట డివిజన్ లోని జీరా కాలనీలోని జై భజరంగ్ దేవాలయం, బాలాజీ దేవాలయం, విక్టోరియా రాణి గంజ్, లలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్ కుమార్, ఆంజనేయులు, వెంకట్ బాబు, మహేష్ యాదవ్, గణేష్, అరుణ్ భట్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట డివిజన్ లో…..
బేగం పేట డివిజన్ లోని కేసరి హనుమాన్ దేవాలయం, భగవంతా పూర్ లోని శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయంలలో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పిజీ రోడ్ లోని కృష్ణా నగర్ కాలనీలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. పూజల అనంతరం నిర్వహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ బి ఆర్ ఎస్ అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు నరేందర్ రావు, శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమీర్ పేట డివిజన్ లో…..
అమీర్ పేట డివిజన్ లోని ధరం కరం రోడ్, గంగు బాయి బస్తీ, బి టైప్ క్వార్టర్స్ లలో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, డివిజన్ అద్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, సంతోష్ మణి కుమార్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, బలరాం, బాబా తదితరులు పాల్గొన్నారు.

సనత్ నగర్ డివిజన్ లో….
సనత్ నగర్ డివిజన్ లోని సెవెన్ టెంపుల్స్ లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు. అదే విధంగా జెక్ కాలనీ, సిటైప్ క్వార్టర్స్, సుందర్ నగర్, ఉదయ్ నగర్ కాలనీ, రవీందర్ నగర్, భగత్ సింగ్ పార్క్ లలో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు కర్ణాకర్ రెడ్డి, పియూష్ గుప్తా, భూపాల్ రెడ్డి, జెక్ కాలనీ ప్రతినిధులు సుబ్బరాజు, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *